బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
- ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం పరిది లోని ములుగు జిల్లా వెంకటా పురం మండలం లో వి ఆర్ కె పురం గ్రామపంచాయతీతో పాటు అనేక జి.పి ల పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అంటూ ప్రచారంలో కారు జోరు పెంచింది. విప్పలగూడెం, చొక్కాల,ఇతర గ్రామాల్లో వాజేడు, వెంకటాపురం కో కన్వీనర్ గూడవర్తి నరసింహ మూర్తి, మండల పార్టి అద్యక్షులు గంపా రాంబాబు, నేతలు డర్రా దామోదర్ ,ఎస్కే ముస్తఫా , మరియు వాజేడు వెంకటాపురం ఎన్నికల కన్వీన ర్ బోదె బోఇన బుచ్చయ్య ,మండల పార్టీ అధ్యక్షుడు క్రిష్ణారెడ్డీ ,పార్టీ నేతలు ,ప్రజా ప్రతినిథులు , పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకు లు, కార్యకర్తలు సర్పంచులు, పార్టీ ప్రజాప్రతినిదులు నాయకత్వం లో జోరు పెంచిన గులాబీ కారు ప్రచారం. వెంకటాపురం మండలం లోని 18 జిపి లలో,మరియు వాజేడు మండలం లోని 17 జి.పి లలో బూత్ ల వారిగా ప్రచార కమిటీలను నియమించి, వ్యవసా య పనులు మిర్చి తోటల కారణంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆదివాసులకు ఇబ్బందులు కలగకుండా పార్టీల నేతలు నమూనా బ్యాలెట్ తో గిరిజన గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్ర మాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 30వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి గెలిపే లక్ష్యంగా, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆకర్షించేందుకు కారు గుర్తు బ్యాలెట్ పేపర్లను ఓటర్లకు, చూపిస్తూ మేనిఫెస్టోలో ఉన్నటు వంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈరోజు ఉదయం వేకువజా ము నుండే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ మేనిఫెస్టో లో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు కు సౌభాగ్య లక్ష్మి పథకం కింద ₹3,000 జీవానాభివృద్ధి అందిస్తు న్నాము. అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి హోల్డర్‌కి సన్న బియ్యం సరఫరా, పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకే అందిస్తానన్న కేసీఆర్, రైతుబంధు ను రైతు సోదరుల కోసం నగదును పెంచి ఇస్తానన్న కేసీఆర్, ఒక లక్ష 16 వేల ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని మూడోసారి ముఖ్యమంత్రి అయితే రెండు లక్షల పదహారు వేల రూపాయలు పెంచి ఇస్తానని కేసిఆర్ హామీలను విస్తృతంగా ప్రజల్లోకి, గ్రామాలు కు , ఓటర్ల వారీగా ఇంటింటి ప్రచారం ద్వారా వెంకటాపురం, వాజే డు మండలాలు నేతలు వివరిస్తున్నారు .ఇంటి ఇంటి ప్రచారా నికి తరలివచ్చే ప్రచార కమిటీలకు ఆయా గ్రామస్తులు, రైతులు, కూలీ లు ఆదివాసీలు జై కేసీఆర్, జై జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు, బి ఆర్ ఎస్ పార్టీ జిందాబాద్ అంటూ స్వాగత సన్నాహాలతో మంగ ళహారతులతో, కారు గుర్తుకే మన ఓటు వేస్తామని, ఈ సంద ర్భంగా ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచార కమిటీలకు ఉత్సా హం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం 15 లక్షలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు ,ఆసరా పెన్షన్ 5,000 వేల రూపాయలకు పెంచు తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తతెలిపారు., కెసిఆర్ బీమా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు.అని తెలిపారు., ఇలా అనేక సంక్షేమ పథకాలను ఓటరులకు వివరిస్తూ ప్రచారాన్ని ప్రతిరోజు కొనసాగిస్తు న్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, సర్పంచ్ పూనెం శ్రీదేవి, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డర్ర దామోదర్, ఆవుల ప్రసాద్, అప్పల రవి ,సత్యేంద్ర, నాగేంద్ర, వార్డు సభ్యురాలు మల్లక్క, రవిచంద్రమూర్తి, మల్లయ్య, పోతురాజు, ఈశ్వరరావు,సారక్క, జాతర, సమ్మయ్య, రమేష్, భార్గవ్, సాయిబాబు, అశోక్, రాజేంద్ర, రాంప్రసాద్, మల్లికార్జున్, సౌమ్య, పూర్ణ, సమీరా, కృష్ణ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.