ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్
- మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తుమ్మల, బాలసాని తో కాంగ్రెస్ కు పెరిగిన ఓటింగ్ శాతం.
- వాజేడు మండలంలో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య పర్యటన.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం సిటింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య శనివారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు భద్రాచలం నియోజకవర్గం లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, అనుచరులుగా పేరుగాంచి, అభివృద్ధి ప్రదాతగా ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక సంక్షేమ పథకాలను మంజూరు చేసి,అమలు చేసి వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజల ఆదరాభిమానాలను పొందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇతర అతిరథ మహారధులు కాంగ్రెస్ పార్టీలో చేరి, భద్రాచలం నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి వీరయ్య ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన డంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అతిరథ మహారధులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో భద్రాచలం ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి పి.వీరయ్యకు 2018 ఎన్నికల విజయం ఎన్నికల శాతం కంటే అన్యూహంగా నియోజక వర్గంలో నాలుగు శాతం పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్లు గా జమ అయ్యాయని రాజకీయ పండితులు జోస్యంతో విశ్లేషిస్తు న్నారు. ఇందులో భాగంగా పార్టీ భద్రాచలం అభ్యర్థి వీరయ్య నాలుగో పర్యాయం శనివారం నియోజకవర్గంలోని వాజేడు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో, పార్టీ ఎన్నికల ప్రచార కో కన్వీనర్ ప్రసాద్ బాబు, పార్టీ నేతలు వర్మ,విక్రాంత్ , వాజేడు సర్పంచ్ టి. ఆదినారాయణ పార్టీ నాయకులు,నేతలు , పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ప్రచార కమిటీలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు వాజేడు మండలంలోని 17 పంచాయతీలలో ఇంటింటి ప్రచార కార్యక్రమాలకు ప్రత్యేక కమిటీలను వేసి వ్యవసాయ ప్రాంతం కావడంతో, మిర్చి తోటలకు పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే రైతన్నలు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీలను ఉదయం, సాయంత్రం వేళలో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మెనుఫెస్టో ను, ఆకర్షణీయమైన కరపత్రాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించి, జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ ప్రచార కార్యక్రమాల్లో ఇతర పార్టీల కంటే ముందంజలో ఉన్నారు. అలాగే వెంకటాపురం మండలంలో అభివృద్ధి ప్రదాతగా నాలుగు దశాబ్దాల పాటు వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనేక సంక్షేమ పథకాల తో ప్రజల ఆదరాభిమానాలు తో,ఎంఎల్సీ కోటా నుండి కోట్లాది రూపాయల నిధులను రెండు మండలాల్లో స్థానికుడిగా మంజూరు చేయించి అభివృద్ధి సంక్షేమ ప్రదాతగా పలువురి ఆదరాభిమానా లు పొందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ను ఆయన అభిమానులు, పార్టీ ప్రజాప్రతినిధులు ,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతమైన ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. వెంకటాపురం పార్టీ నేతలైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం జగన్మోహన్రావు, చిడెం శివ, ఎంపీటీసీ లు గారపాటి రవి, సీతాదేవి, కళాధర్ ,డి.నాగరాజు ,డి.శివ,రమేష్ ఇంకా అనేకమంది నాయకులు పార్టీ ప్రజా ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు, పార్టీ సర్పంచులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మరియు బాలసాని శ్రీ ను ,వేణు ,అశ్వపతి ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని మార్క్ తో మండలంలోని 18 పంచాయతీలలో ప్రచార యాక్షన్ ప్లాన్ తో మండల పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి మెలిసి, పార్టీ అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే పి. వీరయ్య ఘన విజయం సాధించేందుకు, వ్యవసాయ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల కంటే హస్తం గుర్తు దూసుకుపోతున్నది. కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లిన రైతన్నలు, వ్యవసాయ కార్మికుల శ్రమజీవుల ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాన్ని వెంకటాపురం, వాజేడు మండలంలో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సమయం మరో ఐదు రోజులు మాత్రం ఉండటంతో భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య తో పాటు పలువురు వెంకటాపురం మీదుగా వాజేడు మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి వీరయ్య పర్యటనను విజయవంతం చేయాలన్నారు.