పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ధర్నా
ములుగు, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనుటకు సంక్షేమ భవనం లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ఎదుట పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం లేదని ఉద్యోగ ఉపాధ్యా యులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి పీ ఎస్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు గుల్లగట్టు సంజీవ, టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హాట్కర్ సమ్మయ్య, యుటి ఎఫ్ జిల్లా అధ్యక్షులు గొప్ప సమ్మారావు, సి పీ ఎస్ ఉద్యోగు ల సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మంకిడి రవిల ఆధ్వ ర్యంలో వారు మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు వచ్చిన ఉద్యోగులను సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటు హక్కు వినియోగించు కోకుండా పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుండా రకరకాల కారణాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది ఉద్యోగులను ముప్పు తిప్పలు పెట్టి ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ప్రయత్నం లా కనిపిస్తుందన్నారు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగు లకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తు న్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు విని యోగించుకోవడానికి ఒకరోజు ఓడి సౌకర్యం కల్పించాలని వారు ఎలక్షన్ కమిషన్ ను ఈ సందర్భం గా డిమాండ్ చేశారు.అనంతరం ఈ కొత్త విధానం వద్దు అని పాత విధానమే మేలని ఉద్యోగ ఉపాధ్యాయులు నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీ ఎస్ టి డబ్ల్యూ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎట్టి సారయ్య, టీ ఎస్ యు టి ఎఫ్ జిల్లా కోశాధికారి పోదెం సమ్మయ్య, పి ఆర్ టి యు నాయకుడు కాసర్ల రమేష్, టీ ఎస్ యు టి ఎఫ్ నాయకులు కొమురెల్లి భూమిరెడ్డి అల్లం జగ్గా రావు,తోలం కృష్ణయ్య, జబ్బరవి, పూసం లక్ష్మీనారా యణ, బిళ్ళ మల్లారెడ్డి, తులసి, మంజుల, సుగుణ తదితరులు పాల్గొన్నారు.