పీఏసీఎస్ ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందజేస్తున్నామని కాటారం పిఏసిఎస్ ముఖ్య కార్యనిర్వ హణ అధికారి ఎడ్ల సతీష్ అన్నారు. మంగళవారం నాడు మండ లంలోని గంగారం విలాసాగర్ లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొని రావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేపడుతున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రైతులు మల్లయ్య, రాజు, బాపు, లచ్చయ్య, తిరుపతి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.