- మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి
తెలంగాణ జ్యోతి, నవంబర్ 19, వెంకటాపూర్ ప్రతినిధి :
వెంకటాపూర్ మండల కేంద్రంలో బారాస పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించి వెంకటాపూర్ మండలంను అభివృద్ధి చేసుకుందామంటూ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆదివారం మండల కేంద్రంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధు లతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు, మైనార్టీ బందు, బీసీ బందు, కెసిఆర్ కిట్టు, ఆసరా పెన్షన్లు, బారాస 2023 మేనిఫెస్టో ముఖ్య అంశాలను గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి ముచ్చట గా మూడోసారి కెసిఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమన్నారు. వెంకటాపూర్ మండల ప్రజలందరూ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నర్ర భద్రయ్య, సర్పంచ్ మేడబోయిన అశోక్, ఎంపీటీసీ పోశాల అనిత, వీరమల్లు గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కాసర్ల కుమార్, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు మాజీ మండల అధ్యక్షులు కూరెళ్ళ రామాచారి, మండల కో ఆప్షన్ సభ్యులు జహీర్ భాష, మాజీ సర్పంచ్ రహీం పాషా, మాజీ ఎంపీటీసీలు దగ్గు ప్రభాకర్ రావు, గాజుల సుమలత, శ్రీనివాస్, ఎస్టీ సేల్ మండల అధ్యక్షులు రమేష్, మండల మహిళా అధ్యక్షురాలు పూతిలి బాయ్, సీనియర్ నాయకులు స్థానిక వార్డు మెంబర్లు డైరెక్టర్లు సోషల్ మీడియా వారియర్స్, బూత్ ఇన్చార్జీలు, బూత్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.