జర్నలిస్టులను విస్మరించడం సిగ్గుచేటు
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు ఇంటిపట్టాలు : సీతక్క తనయుడు సూర్య
వెంకటాపూర్, నవంబర్ 26 తెలంగాణ జ్యోతి : జర్నలిస్టులను బి ఆర్ ఎస్ ప్రభుత్వం విస్మరించడం సిగ్గు చేటు అని కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తనయుడు సూర్య అన్నారు. ఆదివారం పాలంపేట్ కి చేరుకొని ఇండ్ల స్థలాల కోసం దీక్ష చేస్తున్న వెంకటాపూర్ జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం కు మద్య వారధులే మన జర్నలిస్టులు అని అన్నారు. అలాంటి వారిని పట్టించుకోకుం డా ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాగానే సీతక్క సహకారం తో వెంకటా పూర్ జర్నలిస్టుల కు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించి పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున జర్నలిస్టు ల కు సంపూర్ణ మద్దతు తేలుపుతున్నట్టు సూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడిశెట్టి కోటి, మహిపాల్, జర్నలిస్టులు పాల్గొన్నారు