జర్నలిస్టులకు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకుడి సంఘీభావం
తెలంగాణ జ్యోతి, నవంబర్ 25, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 14 లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న వెంకటాపూర్ జర్నలిస్టులకు శనివారం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆకుల సాంబయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు పక్క ఇండ్లు నిర్మించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగానే వెంకటాపూర్ జర్నలిస్టులు పాలంపేటలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని శాంతి దీక్ష చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు