- కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే మోసపోయి గోసపడతాం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
- కెమెరాల ముందు మూటలు మూసి చత్తీస్గ గడ్ వాళ్లకే పంచి పెట్టింది
- సీతక్క ములుగు ప్రజలకు చేసింది ఏమీ లేదు.
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య
తెలంగాణ జ్యోతి, నవంబర్ 22, వెంకటాపూర్ : కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోయి గోసపడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. 6గ్యారెంటీ ల పేరుతో వస్తున్న నేతలు పక్క రాష్ట్రం చత్తీస్గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ....అదే గ్యారెంటీలు అమలు చేయడం లేదని, అలాంటివారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తానంటే నమ్మేది ఎలా అని ఆమె ప్రశ్నించారు. రానున్నది బీ ఆర్ఎస్ ప్రభుత్వమని, ములుగులో అడ్డంకిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని గద్దె దించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం వెంకటాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ 20 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ధనసరి అనసూయ ములుగు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉంటానని తన తుది శ్వాస వరకు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తు న్నారు. మలుగు ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కరోనా సమయంలో హైదరాబాదు నుంచి మూటలు తెప్పించి కెమెరాల ముందు మూటలు మోస్తూ చత్తీస్గడ్ ప్రజలకు పంచిందే తప్ప ములుగు ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు రప్పించి వెంకటాపూర్ లోని పదివేల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి విజయం సాధించగానే వెంకటాపూర్ పట్టణంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దివంగత మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీర ధర్మ సింగ్ మాట్లాడుతూ తన తండ్రి తర్వాత ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రహల్లాద్ చందులాల్ గారి ఆశయ సాధనకు కృషి చేస్తాడని నమ్మా మని, కానీ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బిజెపిలోకి వెళ్లడం ములుగు ప్రజలకు నమ్మకద్రోహం చేయడమే అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించి చందులాల్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వెంకటాపూర్ ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మా రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిగ గోవింద నాయక్, వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు ఇనుగాలా రమణారెడ్డి, రమా జగదీష్, స్థానిక పార్టీ నేతలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.