కోట గుళ్ళ నిర్వహణకు సహకరిస్తాం : ఎస్ఐ మచ్చ సాంబమూర్తి
- ఆలయంలో ఎస్సై దంపతుల పూజలు
గణపురం, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ల నిర్వహణకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని గణపురం ఎస్ఐ మచ్చ సాంబమూర్తి అన్నారు. ఆదివారం ఎస్ఐ సాంబమూర్తి, సుచరిత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. 27 సోమవారం నిర్వహించే కార్తీక దీపోత్సవానికి రూ 8 వేల తో దంపతులు నూనె క్యాన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి నూనెను అందించిన ఎస్ ఐ దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.