కాళేశ్వరం ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో ప్రచారం.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ప్రచారంలో భాగంగా కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజు ఆధ్వర్యంలో మిర్చి, బంతి పూల తోటలో కూలీలకు తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు ప్రచారం రథం అటునుండి రావడంతో మహిళా వ్యవసాయ కూలీలు డ్యాన్స్ చేస్తూ మద్దతు తెలిపారు.తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.కాళేశ్వరం లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజా అభివృద్ధి కోసం ఎ ఒక్క పని చెయ్యలేదని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రజలకు వివరించారు.గ్రామ గ్రామాన ప్రజలు మాట్లాడుతూ.. పెళ్లి చేసుకొని ఏడు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు రేషన్ కార్డు లేక ఏక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు మహిళలు తెలిపారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మేము పూరి గుడిసెలో జీవనం కొనసాగిం చాల్సిన దుస్థితి వచ్చిందని వివరించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకు మా అత్తమామలకు ఇందిరమ్మ ఇల్లు మంజూర అయింది తప్ప ఈ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం నుండి ఏ ఒక్కరికి ఒక ఇల్లు కూడా ఈ గ్రామాలలో రాలేదని గోడును వెళ్లబోచుకున్నారు. మళ్ళీ మేము వాళ్ళ మాటలు విని మోసపోము కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కి చేతి గుర్తు శ్రీధర్ బాబు కు ఓటు వేస్తామని తేల్చిచేప్పారు. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ రావాలని వారు కోరారు.