కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి భారీ చేరికలు
తెలంగాణ జ్యోతి, మంగపేట, నవంబర్ 22 : మంగపేట మండల కేంద్రం లోని వడ్డెర కాలనీలో బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాటి కృష్ణ సమక్షంలో బిఆర్ స్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేదింటి బిడ్డ బడే నాగజ్యోతిని అసెంబ్లీకి పంపుతామంటూ ఏకగ్రీవ వాగ్దానం చేస్తూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన వడ్డెర కుల స్తులందరూ 200 మంది బిఆర్ఎస్ పార్టీలోకి చేశారు. పార్టీలో చేరిన వారికి ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు బిఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధంశెట్టి వైకుంఠం, వలీబాబా,ప్రదీప్ రావు, తదితరులు పాల్గొన్నారు.