ఏజెన్సీలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీ లో సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన, రోడ్ షో ని డివిజన్ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులకు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.