తెలంగాణ జ్యోతి, నవంబర్ 19, ములుగు ప్రతినిధి : వెంకటాపూర్ రామప్ప మండలం పాపయ్యపల్లి రామప్ప చెరువు ముంపు రైతులు, ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసి మొర పెట్టుకున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి రామప్ప చెరువు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురై పంట పొలాలు, పక్కా ఇల్లు నీట మునిగి ఇబ్బందులకు గురై నష్టపోతున్నా మన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ఆరంభం లోనే మా గ్రామానికి రామప్ప చెరువులోకి వరద నీరు అధికంగా వచ్చి బ్యాక్ వాటర్ ద్వారా మా గ్రామం నుండి జిల్లా కేంద్రానికి రాకపోకలు బందు అయి పడవల సహాయంతో బయటికి దాటే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రామంలో వందల ఎకరాలు నీట మునిగి నష్టపోతున్నామని, గ్రామం ముంపు ప్రాంత ఇండ్లు శిథిలావస్థలకు గురై కూలిపోతు న్నాయన్నారు. పెద్ద మనసుతో మా సమస్యలు, ములుగు బుద్ధారం హైవే రోడ్డు నుండి మా గ్రామానికి మధ్యలో ఐ లెవెల్ బ్రిడ్జి ఏర్పాటు, గ్రామం నుండి స్మశాన వైకుంఠధామం వరకు బీటి రోడ్డు, గ్రామ ముంపు బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ లు, ముంపు బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని మొర పెట్టుకున్నారు. ఈనెల 24వ తారీఖున ములుగు జిల్లా కేంద్రానికి వస్తున్న సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి మాకు తగిన న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు సబ్బని రామచందర్, జాన పట్ల సంపత్, గాజుల సాంబయ్య, మల్యాల కొమురయ్య, లావుడియా సమ్మయ్య, అజ్మీర శ్రీనివాస్ నాయక్, మాలోత్ రమేష్, భూక్య రమేష్, ధరం సోత్ సదర్ లాల్, మాడుగుల భాస్కర్, సాంబయ్య, వాసాల భద్రయ్య, గాజుల శ్రీనివాస్, గాజుల రవి, గాజుల రాజనర్సయ్య, గాజుల ప్రశాంత్, అజ్మీర వీరన్న, రవీందర్, కాసర్ల సాంబయ్య, ఇజ్జగిరి నరసయ్య, ప్రజా ప్రతినిధులు ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ మాడుగుల రమేష్, స్థానిక ఎంపీటీసీ గోపు స్వప్న వాసుదేవరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు సూత్రపు కరుణాకర్, లతోపాటు రైతులు బాధితులు పాల్గొన్నారు.