ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి ఆశీర్వదించండి
తెలంగాణ జ్యోతి, తాడ్వాయి, నవంబర్ 20 : ఈ ప్రాంత రుణం తీర్చుకుంటా మీ ఆశీర్వాదాలు నన్ను ఎమ్మె ల్యే అభ్యర్థిగా నిలబెట్టాయి మరోసారి ఆశీర్వదించండి అభివృద్ధి ఏంటో చూపిస్తా అధికార పార్టీతో ఉంటేనే వేగం గా అభివృద్ధి బడే నాగజ్యోతి కాల్వపల్లి గ్రామస్తులతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల ఆశీస్సులే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాయని మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. జడ్పిటిసిగా గెలిపించి ఆశీర్వదించడం వల్ల ఈ ప్రాంతంలో కొంత మేరకు అభివృద్ధి చేయగలిగానని ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే వేగంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రుణం తీర్చుకుంటానని అన్నారు.సోమవారం తాడ్వాయి మండలంలోని తన జడ్పిటిసి పరిధి గ్రామాలు కాలుపల్లి కొండపర్తి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామా ల ప్రజల సమస్యలు ఓపిగ్గా విన్న నాగజ్యోతి మాట్లాడు తూ మూడోసారి అధికారం లోకి రానున్నది టిఆర్ఎస్ పార్టీ అని అధికార పార్టీతోనే ఉంటేనే ములుగు నియోజక వర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ ప్రాంతానికి పోడు పట్టాలు ఇప్పించిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ దేనని అన్నా రు.గిరిజనేతరులు కూడా పోడు పట్టాలు ఇప్పిం చేందు కు కృషి చేస్తానని వెల్లడిం చారు.అసైన్డ్ భూము లపై పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు టిఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచి నట్లు వెల్లడించారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవ డం ద్వారా సౌభాగ్య లక్ష్మి కింద పేద గృహిణులకు 3 వేల రూ. గౌరవ భృతిని చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 400 రూపాయ లకే గ్యాస్ సిలిండర్ అందించ నున్నట్లు తెలిపారు.ఆర్ గ్యా రంటీ ల పేరుతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని గ్యారంటీల హామీ నెరవేర్చే సీఎం ఎవరో గ్యారంటీ లేదని నాగజ్యోతి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్తు ఉత్పత్తిని పెంచు కోగలిగామని కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తా మంటున్నారని 24 గం టల కరెంటు కావాలా మూడు గంటల కరెంటు కావాలా ప్రజలే తెలుసుకోవాలన్నారు. ఈనెల 30వ తారీకు న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు.