ఇంటింటి ప్రచారంతో హోరెత్తిన బిఆర్ఎస్.
- వి ఆర్ కే పురం లో కారు ప్రచారం జోరు.
వెంకటాపురం తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకే ఓటేయమని ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం పంచాయతీలో మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వ్యవసాయ పనులు, మిర్చి తోటలు కారణంగా రైతులు కూలీలు, ఆదివాసీలను కారు గుర్తు కు ఓటు వేయలని కరపత్రాలతో పరిచయం చేస్తూ, ప్రభుత్వం అమలుపరచిన సంక్షేమ పథకాలను చూసి, కారు గుర్తు కు ఓటు వేయాలని పార్టీ నేతలు కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించారు. మండల పార్టీ అధికార ప్రతినిధి డర్రా దామోదర్, వి ఆర్ కె పురం సర్పంచి పూనేం శ్రీదేవి, పార్టీ కార్య కర్తలు పెద్ద సంఖ్య లో ప్రదర్శనగా వెళ్లి గ్రామ గ్రామాన కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం సాయం త్రం నాటికి ప్రచారం సమాప్తి కావడంతో, గ్రామాల్లో పార్టీ కార్యక్ర మాలు పార్టీల ప్రచారం పతాక స్థాయి కి చేరుకున్నది. ప్రభుత్వ అమలుపరచిన సంక్షేమ పథకాలతో ఓటర్లు ,జై కేసీఆర్ జై జై కేసీఆర్ కారు గుర్తుకే ఓటేద్దాం. డాక్టర్ గారిని గెలిపిద్దాం. అంటూ నినాదాలతో పార్టీకి స్వాగతం పలుకుతూ, కారు గుర్తు దూసుకు పోతున్నది. మండల పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు పర్యవేక్షణ లో, వెంకటాపురం ఎన్నికల ప్రచార ఇంచార్జి గూడవర్తి నరసింహా మూర్తి ఆధ్వర్యంలో మండలంలోని పంచాయతీలలో కారు ప్రచారం జోరుగా సాగుతున్నది.