ఆశీర్వదించండి.. అద్భుతంగా అభివృద్ధి చేస్తా...
- మంథని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి కేసీఆర్ మేనిఫెస్టో తో పాటు తన తల్లి పేరిట నెలకొల్పిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలతో మరింత అద్భుతంగా అభివృద్ధి చేస్తానని మంథని బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కాటారం మండల కేంద్రమైన గారేపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పుట్ట మధు ప్రసంగించారు. మంథని నియోజకవర్గం లోని మానేరు ఇవతలి మండలాలలో అభివృద్ధి తన హయాంలోనే ఎక్కువగా జరిగిందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పుట్ట మధు కోరారు. రోడ్లు, మంచినీటి సదుపాయం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందరికీ అందే విధంగా కృషి చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికంగా ఉండకుండా హైదరాబా దులో మకాం వేసుకొని ఈ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ నక్సలైట్లను, కర్ర స్మగ్లర్లను చేర్చుకొని పచ్చని పల్లెల్లో అశాంతిని నెలకొల్పుతున్నాడనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని పుట్ట మధు అన్నారు. తన ఎమ్మెల్యే హయాంతో పాటు తాను పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పటికీ సహోదరి భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ల సహ కారంతో మంథని నియోజకవర్గంలోని మానేరు ఇవతలి మండలా లను అభివృద్ధి చేశామని అన్నారు. ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని, కెసిఆర్ పరిపాలనను ఆమోదించాలని ఆయన అభ్యర్థించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సైతం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగానే పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పుట్ట మధు అన్నారు. కాటారం కేంద్రంగా బస్ డిపోను ఏర్పాటు చేస్తామని, బస్టాండ్లను నిర్మిస్తా మని, ఫైర్ స్టేషన్లను నెలకొల్పుతామని ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని ఆయన అన్నారు. అంతకంటే ముందు భూపాల పల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని ప్రసంగిం చారు. మంథ ని రహదారి నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేప ట్టారు. కార్నర్ మీటింగ్ లో పుట్ట మధు ప్రసంగిస్తున్న సమయం లో కార్యకర్తలు జోరుగా నినాదాలు చేశారు. కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ చోట తోట జనార్ధన్, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, కర్రు నాగయ్య, రత్న సౌజన్య రెడ్డి, భూపెల్లి రాజు, లక్ష్మీ చౌదరి, రామిళ్ళ కిరణ్, ఐత శకుంతల, రజిత పలువురు వేదిక మీద ఉన్నారు.