అక్టోబర్ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
డెస్క్ : రాష్ట్రంలోని ఓటర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పలు సూచనలు చేశారు. ఎన్నికలలో ఓటర్ ఐడీకి ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చు. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం ఉంటుందని, ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చని, ఫిర్యాదుల కోసం 1950ని సంప్రదించాలన్నారు. అడ్రస్ మార్పు దరఖాస్తులు నేటి నుంచి వాయిదా వేసినట్లు తెలిపారు.