పాపయ్యపేటలో యదేచ్చగా రేషన్ బియ్యం దందా

Written by telangana jyothi

Published on:

పాపయ్యపేటలో యదేచ్చగా రేషన్ బియ్యం దందా

తెలంగాణ జ్యోతి, చెన్నారావుపేట : ఉమ్మడి వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం  పాపయ్యపేట గ్రామం లో ప్రతీ రోజు రేషన్‌ బియ్యం రాత్రి పగలు తేడా లేకుండా రేషన్ దందా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తలపెట్టిన ఉచిత బియ్యం పంపిణీ ని ఆసరా చేసుకుని కొందరు అక్రమార్కులు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. యదేచ్చగా దందాను కొనసాగిస్తూ కాసులు నింపు కుంటున్నారు. తనిఖీలలో దొరికిన తమకు పడే శిక్ష తక్కువగా ఉండడంతో ఉచిత బియ్యం అక్రమ రవాణ దారులు అంతకంతకూ చెలరేగిపో తున్నారు. ఇకనైనా చెన్నారావుపేట పోలీస్ అధికారులు గట్టి నిఘా పెట్టాలని స్థానికులలు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

Leave a comment