ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
– ఆదివాసి ఐక్యవేదిక వెంకటాపురం సంఘాల పిలుపు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చారు. ఈ మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ విశ్రాంతి భవనం ఆవరణలో గొండ్వానా సంక్షేమ పరిషత్ నేత పూనేం సాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా సెలవు దినంగా ప్రకటించి, ఆదివాసి అస్తిత్వా న్ని కాపాడే విధంగా చొరవ చూపాలని అన్నారు. అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆదివాసి గూడాలంతా కదిలి ఆది వాసులంతా ఏకమై ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు.అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ మన ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలు, జీవోలు నిర్వీర్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ మేరకు ఆగస్టు 9 న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, మన ఆదివాసి ల ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ఐక్యసంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదివాసి యువత తదితరులు పాల్గొన్నారు.