ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పు అంటుకొని మహిళకు తీవ్ర గాయాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన చిచ్చడి కళావతి అనే మహిళ తమ మిర్చి తోట వద్ద చెత్త తగల బెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్చి తోట గట్ల సమీపంలో పడ వేసిన చెత్తా చెదారం ప్లాస్టిక్ మర్చింగ్ షీటు కుప్పలకు నిప్పు పెట్టగా, గాలికి మండుతున్న ప్లాస్టిక్ పేపర్ ఆమె పై పడి క్షణాల్లో దుస్తులకు అంటు కుంది. ఒక్కసారిగా గాలులు రావడంతో ప్లాస్టిక్ పేపరు మంటలతో ఆమె ఒంటిపై పడి దుస్తుల కు అంటుకున్నది. ఈ ప్రమాదంలో సుమారు 30% పైగా కాలిన గాయాలతో కళావతిని హుటా హుటిన 108 వాహనంలో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలకు అంబులెన్స్ ద్వారా తరలించి నట్లు వెంకటాపురం వైద్యశాల సిబ్బంది తెలిపారు.