రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం బైక్ పై వెళ్తున్న మహిళ అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు బలమైన దెబ్బ తగలడం తో స్పృహ కోల్పోయింది. క్షత గాత్రురాలు చిరుతపల్లి గ్రామం నివాసి అయిన అట్టం ముత్తమ్మ 50 సం. భర్త కృష్ణ మూర్తి గా గుర్తించారు. గ్రామస్తులు హుటాహుటిన వెంటనే 108 అంబు లెన్స్లో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ములుగు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎం జీ ఎం కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె మృతితో చిరుతపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.