అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
– ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : తాడ్వాయి- కాటాపు రం మధ్యలో గల నాంపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమాన స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి… ఏటూరునాగారం మండలం చిన్న బోయిన పల్లి గ్రామానికి చెందిన రడం సుజాత కాటాపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తుంది. రోజువారిగా విధులను పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు తన కుటుంబ సభ్యులకు కాటాపురం నుండి నేను వస్తున్న అని ఫోన్ చేసిన గంట తర్వాత నుండి ఫోను స్విచ్ ఆఫ్ లో ఉందని, సాయంత్రం వరకు ఎదురుచూసిన కుటుంబ సభ్యులు సుజాత ఎంతకు రాకపోయేసరికి కాటాపురం అంగన్వాడి సెంటర్ లో పని చేస్తున్న ఆయాను చుట్టుపక్కల వారిని విచారించి ఇంటికి వచ్చారు. బుధవారం ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. కాగా మృతికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.