వాజేడు ఎస్సై ఆత్మహత్యకు కారకురాలైన మహిళ అరెస్టు

వాజేడు ఎస్సై ఆత్మహత్యకు కారకురాలైన మహిళ అరెస్టు

వాజేడు ఎస్సై ఆత్మహత్యకు కారకురాలైన మహిళ అరెస్టు

– మీడియాకు వెల్లడించిన వెంకటాపురం సి.ఐ .కుమార్

వెంకటాపురం నూగూరు,  తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్రారపు హరీష్ (29) ఆత్మహత్యకు కారకురాలైన మహిళ ను శనివారం అరెస్ట్ చేసినట్లు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.కుమార్ మీడియాకు తెలిపారు. సి.ఐ. కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియా తండా గ్రామానికి చెందిన బానోతు అనసూర్య, అలియాస్ అనూష 7 నెలల క్రితం నుండి వాజేడు ఎస్సై హరీష్ కు ఫోన్లు చేస్తూ ఉండగా సాన్నిహిత్యం పెరిగిందన్నారు. ఈ క్రమంలో తనను  తరచూ పెళ్లి చేసుకోమని వేధింపులకు గురి చేసేది. పెళ్లికి నిరాకరిస్తే తనను శారీరకంగా వాడుకొని, తన జీవితం నాశనం చేశారని మీడియాకు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఫోన్లో బ్లాక్ మెయిలింగ్ చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడేదన్నారు తీవ్ర మనోవేదనకు గురైన ఎస్.ఐ. రుద్రారపు హరీష్ ఈనెల రెండో తేదీన ఫెరిడో రిసార్ట్ కి వెళ్లి తన సర్వీసు రివాల్వర్ తో తల భాగంలో కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. ఎస్సై హరీష్ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు కారకురాలైన బానోతు అనసూర్యను అరెస్టు చేసినట్లు వెంకటాపురం సి.ఐ. బి కుమార్ తెలిపారు. ఈ మేరకు కోర్టులో హాజరు పరచను న్నట్లు తెలిపారు. కాగ ఎస్సై హరీష్ ఆత్మహత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment