అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు.

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు.

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : ఎన్నికలవేళ చత్తీషుగడ్ ఆబూజమడ్ ప్రాంతంలో గత మంగళవారం మావోయిస్టులకు పోలీసుల బలగాలకు జరిగిన ఎదురుకాల్పులలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో కాళేశ్వరం చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం తొలి దశ లోకసభ ఎన్నికల దృష్ట్యా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంతర్రాష్ట్రవంతన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. మహాదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ముమ్మరoగ వాహన తనిఖీలు చేపట్టారు. ఆయా రాష్ట్రాల నుండి వచ్చిపోయే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమా నితులు కనిపిస్తే విచారించి వివరాలు తెలుసుకొని వదిలేశా రు. వారి వెంట పోలీసులు ఉన్నారు.