వెంకటాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మహాలక్ష్మి వీధికి చెందిన మడకం శ్రీను 60.సం. తన రెండు కాళ్ళు వైద్యులు కొన్ని సంవత్సరాల క్రితం శస్త్ర చికిత్స చేసి తీసివేషారు. పేద కుటుంబానికి చెందిన మడకం శీను దీనావస్థను చేయూత ఫౌండేషన్ ద్వారా వెంకటాపురం ఏ.ఎస్.ఐ అక్బర్ బాషా కు తెలియపరిచారు. స్పందించి మడకం శ్రీను కొరకు చేయూత ఫౌండేషన్ ద్వారా వీల్ చైర్ తెప్పించారు.ఈ మేరకు వెంకటా పురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, ఎస్.ఐ కె.తిరుపతిరావు చేతుల మీదుగా గురువారం వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్.ఐ కె. ఆంజనే యులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు చేయూత ఫౌండే షన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్, పోలీస్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.