WhatsApp | వాట్సప్ లో కొత్త ఫీచర్లు

WhatsApp | వాట్సప్ లో కొత్త ఫీచర్లు

WhatsApp | వాట్సప్ లో కొత్త ఫీచర్లు

డెస్క్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp).. తాజాగా మరి కొన్ని సదుపాయాలు జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్ను సేవ్ చేయకపోయినా.. అవతలి వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్..కాంటాక్ట్ సేవ్ చేయడం లో కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. లింక్డ్ డివైజెస్లోనే కాంటాక్ట్ని సేవ్ చేసేలా తన ప్లాట్ఫామ్ను రూపుమార్చనుంది. వాట్సప్లోని చాట్లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్లోనే కాంటాక్ట్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్ డివైజెస్లో సేవ్ చేసే సదుపాయం ఉండేది కాదు. చాలామంది యూజర్లు వాట్సప్ని ఒకటికంటే ఎక్కువ డివైజుల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి వాళ్లు పేర్లు యాడ్ చేయడానికి ప్రతిసారీ ప్రైమరీ డివైజ్కు వెళ్లాల్సివచ్చేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ లింక్ చేసిన పరికరాల్లోనూ కాంటాక్ట్ సేవ్ చేసేలా సరికొత్త ఫీచర్ తీసు కొచ్చేందుకు వాట్సప్ సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తులు మొదలు పెట్టింది. ఇకపై కొత్త కాంటాక్ట్ ని ప్రత్యేకంగా వాట్స ప్లోనే సేవ్ చేసేలా సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేయనుంది. అంటే కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో కేవలం వాట్సప్లో యాడ్ చేయాలా? లేదా మొబైల్లోనూ యాడ్ చేయాలా? అని రెండు ఆప్షన్లు కనిపించనున్నాయి. అందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చన్నమాట. ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నా, మొబైల్ ని మార్చినా వాట్సప్ లోని కాంటాక్ట్లు అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్లో పంచుకుంది. సంబంధిత స్క్రీన్షాట్ను పంచుకుంది. త్వరలోనే ఈ ఫీచర్ వాట్సప్ వెబ్, విండోస్ యూజర్లకు అందుబాటులోకి రానుం ది. చాట్ రికార్డింగ్ వాట్సప్ లోని మెటా ఏఐ పర్సనల్ అసిస్టెంట్గా ఉపయోగపడుతోంది. సందేహాలకు సమాధానా లిస్తూ చాలా విషయాల్లో చేదోడుగా నిలుస్తోంది. దీనికి కొత్త చాట్ మెమొరీ ఫీచర్ జత కానుంది. మెటాకు మనం అందిం చే సమాచారాన్ని రికార్డు చేసి మెరుగైన పర్సనల్ అసిస్టెంట్గా మారుతుంది. ఉదాహరణకు- యూజర్ శాకాహారి అని అది గుర్తించిందనుకోండి. ఆ వంటకాలనే సూచిస్తుంది. ఇలా మీ పుట్టిన రోజు, వ్యక్తిగత ప్రాధాన్యతలు, వివరాలను గుర్తుంచు కుంటుంది.ప్రస్తుతం ఈఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment