సంక్షేమ ఫథకాలే గెలుపుకు పునాది రాళ్ళు 

Written by telangana jyothi

Published on:

సంక్షేమ ఫథకాలే గెలుపుకు పునాది రాళ్ళు 

  • అభివృద్దిని చూసి ఓటు వేయ్యండి 
  • అభివృద్దే మా ప్రచార హస్ర్తం
  • ప్రారంభమైన ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం 
  • బ్రహ్మరథం పట్టిన ప్రేమ్ నగర్, గొల్లవాడ, వివర్స్ కాలనీ విస్తృత ప్రచారం  
  • జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి 

 ములుగు ప్రతినిధి : సంక్షేమ పథకాలే తన గెలుపుకు పునాది రాళ్లు అని ములుగు జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె ములుగులోని గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుండి తన ప్రచారాన్ని పార్టీ శ్రేణులుతో కలిసి మొదలు పెట్టారు. అందులో భాగంగా మొదట ప్రేమ్ నగర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ములుగు గ్రామంలోని గొల్లవాడ, వివర్స్ కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అందులో బాగంగా స్థానిక మహిళలు, యువకులు , గ్రామ ప్రజలు హారతుల , డప్పు చప్పుళ్లు, బతుకమ్మలతో తో ఘన స్వాగతం పలుకగా బడే నాగజ్యోతి స్థానిక సమస్యలను తెలుసుకుంటూ తన ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్దే తన ప్రచారానికి హస్త్రాలు అని, కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్దిని చూసి తనకు ఓటు వేయ్యాలని, తనకు ఓటు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ కు తన మద్దతు తెలిపినట్లేనని నియోజక వర్గంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని ఆమె అన్నారు. అదే విధంగా ములుగు జిల్లా కేంద్రంలోని మసీదులో ప్రత్యేక పూజలు నిర్వహించి ముస్లీం మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, అజ్మీరా ధరమ్ సింగ్, ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ములుగు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్న విజయ్, ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, రాణా ప్రతాప్, సుధీర్, మహేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now