గడ్డం వంశీని ఎంపీ గా గెలిపిస్తం
గడ్డం వంశీని ఎంపీ గా గెలిపిస్తం
తెలంగాణ జ్యోతి, కాాటారం ప్రతినిధి: పెద్దపల్లి పార్లమెం టు అభర్తి గా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న గడ్డం వంశీ కృష్ణ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సోమ వారం మండలం లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఐటి మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరాజ్ పేట (గంగపుత్ర కాలనిలో) ఉపాధిహామీ కూలీలతో మమేకం అయ్యి యువజన కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ పిలుపు మేరకు కొత్తపల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో యువజన కాంగ్రెస్ మండల నాయకులు సుందిల్ల ప్రభుదాస్, యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు చిలుముల అశోక్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా తిరుపతి, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి వినోద్ కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి లక్ష్మి, మహిళా గ్రామ అధ్యక్షురాలు ఉప్పుల రజిత, ఉప్పుల తిరుమల్, చిట్యాల చిరంజీవి, బద్రి, శ్రీను, సురేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.