ప్రాచీన కలలకు ప్రాణం పోస్తాం : ఎంపీపీ పంతకాని సమ్మయ్య
ప్రాచీన కలలకు ప్రాణం పోస్తాం : ఎంపీపీ పంతకాని సమ్మయ్య
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ప్రాచీన కళలకు ప్రాణం పోస్తామని కాటారం మండల పరిషత్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య అన్నారు. మంగళవారం రాత్రి ఆయన కాటారం మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న చిరుతల రామాయణం వేదికను సందర్శించారు. అలనాటి రామాయణాన్ని నేటి కాలంలో వేషాధారణతో పలు పాత్రలను పోషిస్తూ నటులు కళాకారులు ఈ సమాజానికి ఎనలేని సేవను అందిస్తున్నారని ఎంపీపీ సమ్మయ్య కొనియాడారు. కళాకారులను గుర్తించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు కాంగ్రెస్ ప్రభుత్వం అంద జేస్తుందని, ఇందుకు మంథని శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో కళాకారులకు న్యాయం చేస్తామని ఎంపీపీ సమ్మయ్య అన్నారు. చిరుతల రామాయణం కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి రమేష్, గ్రామ పెద్దలు జియ్యేరు మల్లయ్య, రాంబాబు, రాజబాపు, సమ్మయ్య, రాజు, సురేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు.