మార్చి, 2026 నాటికి దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం

Written by telangana jyothi

Published on:

మార్చి, 2026 నాటికి దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం

– రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత క్రమంలో దేవాదుల ప్రాజెక్ట్.

– అదనంగా సేద్యంలోకి రానున్న 89 వేల 312 ఎకారాల కొత్త ఆయాకట్టు

– సస్యశ్యామలం కానున్న 7 జిల్లాలు (వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి)

– తక్కువ ఖర్చు తో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రణాలికలు

–  తుది దశకు చేరుకున్న ఫెస్-3 పనులు

– 1100 కోట్లతో కాలువలలో పూడిక తీత, జంగల్ క్లియరెన్స్

– 2 వేల 947 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్

–  20 పంప్ హౌజ్ లు పూర్తి.

– ముగింపు దశకు చేరుకున్న మరో 3 కొత్త చెరువుల నిర్మాణాలు

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలో దేవాదుల ప్రాజెక్ట్ మార్చి, 2026 నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ములుగు జిల్లా జె చొక్కారవు దేవాదుల ప్రాజెక్టుకు చేరుకోగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సితక్క, శాసనమండలి డెప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరిష్, శానసభ్యులు పుష్పగుచ్చాలు అంధించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదుల ఇంటెక్ పంప్ హౌస్ ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ పనుల పురోగతి పై జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ లతో శుక్రవారం ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలం జై చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద సమాచార పౌర సంబంధాల శాఖ, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క), శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,నీటి పారుదల శాఖ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులను పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకోవడమే కాకుండా గోదావరి జలాల తరలింపు, వారి నియోజక వర్గాల్లో నీటిపారుదల కు సంబంధించిన ప్రాజెక్టు ల, కాలువల పెండింగ్ పరిస్థితులపై ఆయా శాసన సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకొని, ఆయా ప్రాజెక్టు లపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతంలో సమీక్ష సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. 2008 సంవత్సరం శిలాఫలకం వేయబడ్డ దేవాదుల ప్రాజెక్టును 2026 సంవత్సరం మార్చి లోపు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి గోదావరి జలాలతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలో పెట్టింది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు నీటి పారుదల శాఖ పనులను నాణ్యతతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా దేవాదుల పూర్తి చేసి 5 లక్షల 57 వేల ఎకరాల కు నిరందిస్తామని అన్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజి కట్టడం వల్ల 300 రోజుల పాటు 60 టిఎంసీ ల సాగునీరు ఎత్తిపోతల ద్వారా అందిస్తామని అన్నారు. దీని ద్వారా (వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. చత్తిస్గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్ ఓ సి సేకరించి సమ్మక్క సాగర్ బ్యారేజ్ లో నీరు నిల్వ చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టునకు సంబంధించిన పెండింగ్ బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగులో ఉన్న భూ సేకరణ కోసం ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 700 మంది సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, 18 వేల లక్షర్ లను ఔట్ సోర్సింగ్ పై నియమించామని తెలిపారు.మొత్తం మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే భూ సేకరణతో సహా 91% పనులు పూర్తి అయినాయి. మిగిలిన పనులు పూర్తి చేసి 2025 మార్చి నాటికి 89 వేల 312 ఎకారాల కొత్త ఆయాకట్టుకు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  2004 – 2005 లో అప్పటి ప్రభుత్వం 6016 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును కాలక్రమంలో పేజ్-2, ఫేజ్-3 లుగా విస్తరించడంతో 17 వేల 500 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 14 వేల 188 కోట్ల ఖర్చు తో ప్రాజెక్టు నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. మొత్తం భూసేకరణ 33 వేల 224 ఎకరాలుగా నిర్ణయించగా ఇప్పటివరకు 30 వేల 268 ఎకరాలను సేకరించినారు. మరో 2 వేల 957 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి దశలో 3 రిజర్వాయర్ లు, 4 పంప్ హౌజ్ ల ద్వారా 1 లక్షా 24 వేల ఎకరాల ఆయకట్టుకు 350 క్యూసెక్కుల నీరు అందించినారు. అదేవిదంగా రెండో దశలో 9 రిజర్వాయర్లు, 7 పంప్ హౌజ్ ల ద్వారా 1 లక్షా 93 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించినామన్నారు.తుది దశకు చేరుకున్న మూడో దశ పూర్తి అయిన పక్షంలో 2 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టుకు 10 పంప్ హౌజ్ ల ద్వారా 1750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మల్టీ స్టోరేజి ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో గోదావరి నీటి మట్టం నుండి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోయనున్నారు. మొత్తం 39.16 TMC ల నీటిని ప్రతి సంవత్సరం 170 రోజులు నీటిని ఎత్తిపోయడం జరుగుతుందన్నారు.సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ ద్వార ౩౦౦ రోజులు 60 టి యం సి ల గోదావరి జలాలను ఉపయోగం లోకి తిసుకోస్తామని, ఉమ్మడి వరంగల్ జిల్లలో ప్రతి ఎకరానికి నీరు అందెల చూస్తామని అన్నారు.1100 కోట్ల రూపాయ లతో  కాలువలలో పూడిక తీయుటకు జంగల్ క్లియరెన్స్ కు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కొరకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు .సమీక్షా సమావేశం లో చర్చించిన అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.నీటి పారుదల శాఖ అధికారులు చిత్త శుద్దితో, నిజాయితీ తో పూర్తి సమర్ధత తో పని చేయాలనీ నిరంతరం అందుబాటు లో ఉండాలని తెలిపారు , రాష్ట్ర రెవెన్యు, హోసింగ్, సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ 2008 సంవత్సరంలో దేవాదుల ప్రాజెక్ట్ కు శంఖుస్తాపన చేయడం జరిగిందని , సుమారు 15 సంవస్సరాలు ఈ ప్రాజెక్ట్ పనులు నత్త నడక గా ఉన్నాయ,ని 2026 మార్చ్ నాటికి అత్యంత ప్రాదాన్యత ఇస్తూ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సుమారు ఇంకా 3 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉందని , రైతులను రాజు ను చేయడమే ఉద్దేశ్యం తో ప్రాజెక్ట్ లకు అధిక ప్రాదాన్యత ఇస్తూ అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని తెలిపారు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర తో ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం అధికారులను ఆ రాష్ట్రానికి పంపించడం జరిగిందని అన్నారు.సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ స్టోరేజ్ చేసిన నీటిని లిఫ్ట్ చేటడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి  దనసరి అనసూయ సితక్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు ద్వారా ములుగు నియోజకవర్గానికి సాగు నీరు రావడం లేదని, కన్నాయిగూడెం ప్రాంతంలో తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల బ్యారేజ్ నిర్మాణం కొరకు భూమి కోల్పోయిన రైతులకు మానవీయ కోణంలో ఆలోచించి తగినంత నష్టపరిహారం అందించాలన్నారు. మంగపేట, కన్నాయి గూడెం, ఎటునాగారంలలో కెనాల్స్ పై ఏర్పాటు చేసిన లిస్టులో సరిగా పనిచేయక తాగునీరు అందడం లేదన్నారు. ఆకల ద్వారా నర్సంపేటకు నీరందిస్తూ కొత్తగూడెం కూడా సాగునీరు అందించేలా ప్రణాళిక చేయాలని కోరారు. పేదరికాన్ని తగ్గించడానికి సాగునీరు పెంచడమే పెద్దమ్మ కర్తవ్యమని అన్నారు. రామప్ప నుండి పాకాల పోయే ప్రాంతంలో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించుటకు కాలువలు నిర్మించాలని కోరారు. రామప్ప నుండి లక్నవరానికి కెనాల్ మంజూరు చేశారని, కానీ ఇప్పటివరకు భూసేకరణ జరగలేదన్నారు. రామప్ప లక్ష్మవరం లింక్ను త్వరగా పూర్తిచేయాలని మంత్రి సితక్క కోరారు.  శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం 15 సంవత్సరాల నుంచి పూర్తి కాకుండా పనులు నత్త నడక కొనసాగాయి కానీ నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన అనంతరం సాధ్యమైనంత తొందర్లోనే ప్రాజెక్ట్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పూర్తి చేయడం జరిగింది తెలిపారు. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ ద్వారా ఎగువ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేస్తూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాలకు మళ్లించడం జరుగుతుందని పేర్కొ న్నారు.ప్రాజెక్ట్ నుంచి నీటి మళ్లింపు విషయం లో ఉమ్మడి వరంగల్ జిల్లాను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళిక ద్వారా నీటిని అధించాలని అన్నారు. శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కె ఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ, యశ శ్విని రెడ్డి, డాక్టర్ మురళి నాయక్ తమ తమ నియోజ కవర్గాల్లో ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్, కాలువల పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్ తదితరసాగునీటి సమస్యలు గురించి మంత్రులకు వివరిం చారు. ఈ సమావేశంలో కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, నీతిపారుదల శాఖ ఈ ఎన్ సి, ఎస్సీ, ఈఈ లు, డి ఇ లు,సంబంధిత శాఖల అధికారులు, ఏజెన్సీలు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment