మల్లన్న గుడికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం
– మాజీ ఎంపీటీసీ జనార్ధన్ వెల్లడి
కాటారం , తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన సబ్ స్టేషన్ పల్లిలో జరుగుతున్న మల్లన్న బోనాలను కాటారం మాజీ ఎంపీటీసీ తోట జనార్ధన్ సందర్శించారు. మల్లన్న బోనాలకు సదుపా యా లను ఏర్పాటు చేస్తామని, గుడి నిర్మాణం విషయంలో రాబోయే కాలం లో సహాయ సహకారాలు అందిస్తామని తోట జనార్ధన్ అన్నా రు. భక్తులకు సదుపాయాలు కల్పించి, ప్రజలకు మరింత చేరువగా తీర్చిదిద్దుతామని అన్నారు. వందలాదిమంది మల్లన్న బోనాలను మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రాంతంలో జరుగు తున్న మల్లన్న బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు మంగళ హారతులతో పాటు పసుపు, బండారాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ స్టేషన్ పల్లె మల్లన్న గుడి నిర్వాహకులు,భక్తులు,మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.