ఆసుపత్రికి వచ్చే ప్రజలను మన అతిధులుగా భావించాలి 

ఆసుపత్రికి వచ్చే ప్రజలను మన అతిధులుగా భావించాలి 

ఆసుపత్రికి వచ్చే ప్రజలను మన అతిధులుగా భావించాలి 

వైద్యులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హితవు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యు లను ఆదేశించారు. బుధవారం మహా ముత్తారంలోని ప్రాథమి క ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలైటి, డ్రగ్ స్టోర్, వాక్సిన్లు భద్రపరచు గది, ఫ్రిజ్, రక్త పరీక్షలు నిర్వహించు గదిని, ఓపి రిజిస్టర్ పరిశీలించారు. డెంగీ వ్యాధి నిర్దారణ కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నా రు. ఎలాంటి వ్యాధులతో బాధపడే వారు వైద్య సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని డెంగీ కేసులు నమోదు అయ్యాయని వైద్యులను అడుగగా ఒకటి వచ్చినట్లు తెలిపారు. జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యాధి గ్రస్థులతో మాట్లాడి సమస్యలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. వైరల్ జ్వరాలతో వైద్య సేవలకు వస్తున్న వారి గురించి వైద్యులను అడిగి తెలుసు కున్నారు. వైద్య సేవలకు ఆసుపత్రికి వచ్చే ప్రజలను మన అతిధులుగా భావించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించా లని సూచించారు. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడిన రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలిన ప్రాంతా లలో జ్వర సర్వే నిర్వహించాలని తెలిపారు. పాము, కుక్క కాటు తదితర వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైద్యులు సుధీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.