అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి⁸
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి : భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ది శాఖ వారి ఆధ్వర్యంలో భూపాలపల్లి లోని అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ వర్గీకర ణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరచేర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటర్నేష నల్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రైతులకు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూ భారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.