క్రీడల్లో రాణించి పతకాలు సాధించాలి : మంత్రి శ్రీధర్ బాబు

క్రీడల్లో రాణించి పతకాలు సాధించాలి : మంత్రి శ్రీధర్ బాబు

క్రీడల్లో రాణించి పతకాలు సాధించాలి : మంత్రి శ్రీధర్ బాబు

   కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యం లో నిర్వహించిన క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవం లో పాల్గొనీ , విజేతలకు బహుమతులు అందజేసిన కార్యక్రమం లో మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని నియోజకవర్గాన్ని సరస్వతి నిలయంగా మార్చడమే తమ లక్ష్యమని, అందుకు అందుబాటులోకి వివిధ విద్యాలయాలను స్థాపించామని, అలా గే మారుమూల గ్రామాలకి చెందిన విద్యర్థులకు విద్యను అందు బాటులోకి తీసుకొచ్చి వారి జీవితాలను మార్చేవిధంగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. అలాగే తల్లి తండ్రులు కూడా వారికి ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడ ల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం తో జీవించవచ్చని తెలిపారు. కాటారం ఏరియా ట్రస్మా అధ్యక్షు లు కొట్టే శ్రీశైలం, ట్రస్మ నిర్వాహకులు జనగామ కార్తీక్ రావు, వలస వెంకటేశ్వర్లు, చీర్ల శ్రీనివాస్ రెడ్డి, సంపత్ రావు, జనగామ కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన 

కాటారం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మించ నున్న వేజ్ మార్కెట్ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే జాతీయ గ్రామీణ అభివృద్ధి ఉపాధిహామీ పథకం ద్వారా మంజూ రైన సీసీ రోడ్ల శంకుస్థాపన చేశారు. అయ్యప్ప టెంపుల్ నుంచి హమాలి సంఘం వరకు, అలాగే జర్నలిస్టు స్వర్గీయ వేముల శ్రీశైలం వాడకు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీపాద కాలనీ డ్రైనేజీ నిర్మాణానికి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎం పి ఓ వీరస్వామి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు, కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చీమల సందీప్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మహాముత్తారం మాజీ జెడ్పిటిసి లింగమల్ల శారద, ఐత శకుంతల, డాక్టర్ ఎలుబాక సుజాత, మాజీ జెడ్పిటిసి ఆంగోతు సుగుణ, ఓ బి సి అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, వివిధ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment