ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి
– ప్రైవేటు ఎలక్ట్రీషియన్ ల సమావేశం తీర్మానం
వెంకటాపురం నూగూరు,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ ప్రైవేటు ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశమై వారు ఎదుర్కొం టున్న వివిద సమస్యలను పరస్పరం చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు అంతా ఐక్యంగా ఉండి, హక్కులు సాధించుకోవాలని, అందరూ ఒకే కుటుంబాలుగా కలిసి,మెలిసి కష్టపడి జీవించాలని, కష్ట ,సుఖాల్లో పాలు పంచుకోవాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రైవేటు ఎలక్ట్రిషన్లకు కూడా వర్తింపజేయాలని, సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని సమావేశం తీర్మానించింది. వెంకటా పురం తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్, టెక్నీషియన్స్ ఫెడరేషన్ యూనియన్ మండల శాఖ తమ సమస్యల పైన తమ హక్కుల పైన పని విధానం, పనికి ముందు జాగ్రత్త లు గురించి, లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు కొరకు చర్చించారు. వెంకటాపురం, వాజేడు మండలాల ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సీనియర్ ఎలక్ట్రికల్ టెక్నీషి యన్స్ పానం శ్రీను, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, కొండ రాంబా బు, సతీషు, సాగర్, రమేష్, మోహన్రావు, రాఘవులు , సునీల్ తదితరులు పాల్గొన్నారు.