ములుగులో రెగ్యులర్ ఫాగింగ్ నిర్వహిస్తున్నాం
ములుగులో రెగ్యులర్ ఫాగింగ్ నిర్వహిస్తున్నాం
– పారిశుధ్య సమస్యలుంటే సమాచారం ఇవ్వండి
– ఎంపీవో రహీమోద్దీన్
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహిస్తున్నామని, దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని ఎంపీవో ఎండీ.రహీమోద్దీన్ అన్నారు. మేజర్ జీపీ ఈవో పి.రఘు ములుగులోని పలు కాలనీల్లో మంగళవారం పవర్ స్ర్పెయర్ ద్వారా జీపీ సిబ్బందితో కలిసి ఇంటింటికి దోమల నివారణ మందులు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ సానిటేషన్ నిర్వహణ లోపాలు, లార్వా నియం త్రణ పనులు ఏ కాలనీలో అయినా సక్రమంగా నిర్వహణ జరుగకుంటే కార్యదర్శికి సమాచారం ఇవ్వాలన్నారు. నిత్యం పర్యవేక్షిస్తున్నామని, జీపీ సిబ్బంది ప్రాణాంతక దోమల నివారణ మందులను పిచికారీ చేస్తున్నారన్నారు. సానిటేషన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని, డ్రైనేజీ క్లియరెన్స్ చేపడుతూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల ముందు వ్యక్తిగతంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు పంచాయతీ కార్యదర్శి పి.రఘు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.