ఆర్టీసీ బస్ స్టేషన్ మరుగుదొడ్లకు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
– రెండు రోజుల్లోగా విద్యుత్ మోటార్ మరమ్మతులు
తెలంగాణ జ్యోతి వార్తకు స్పందన
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం లోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో విద్యుత్ మోటార్ కాలి పోవటంతో వారం రోజులుగా ప్రయాణికులు నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జ్యోతి ప్రచురించిన వార్తపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. సోమవారం జి.పి. వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి మరుగుదొడ్లను ఓపెన్ చేశారు. వాటర్ డ్రమ్ములలో నీళ్లు నింపి ప్రయాణికులకు సౌక ర్యాలు కల్పించారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి విద్యుత్ మోటార్ రిపేర్లు పూర్తిచేసి వాటర్ సరఫరా పునరుద్ధరిస్తామని, అప్పటివరకు వాటర్ ట్యాంకుల ద్వారా ప్రయాణికులకు నీటి సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. ప్రయాణికుల కష్టాలను ప్రచురించి నీటి సౌకర్యం కల్పించినందుకు తెలంగాణ జ్యోతికి ప్రయాణికులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.