ఎంపీడీఓ భవనం పై వృధాగా పోతున్న నీరు..!

ఎంపీడీఓ భవనం పై వృధాగా పోతున్న నీరు..!

ఎంపీడీఓ భవనం పై వృధాగా పోతున్న నీరు..!

  • కలిషితమవుతున్న తాగునీరు
  • మండల వ్యాప్తంగా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం:  శీతాకాల సమయంలో మండల వ్యాప్తంగా తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవైపు తాగునీరు సప్లై చేసే మిషన్‌ భగీరథ వాటర్‌ పైప్‌ లైన్‌ లీకేజీతో ఎంపీడీఓ భవనం పై  నుండి త్రాగునీరంతా వృథాగా పోతుంది. పైప్లైన్ లీకేజీ లతో గ్రామ ప్రజలు నీటి సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ సంబంధిత అధికారులు పైప్‌ లీకేజీలను మరమ్మతులు చేయడంలో విఫలమై కలుషితమైన నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగిన ప్రజలు అనారో గ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మండల వ్యాప్తంగా మిషన్‌ భగీరథ వాటర్‌ లీకేజీ అవుతుందని సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినా నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనీ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ అధికారుల పైన సర్వత్రా విమర్శలు తలేత్తుతున్నాయి.ఇది ఇలా ఉండగా….మిషన్ భగీరథ సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీడీవో ఆఫీస్ వద్ద పైప్లైన్ లీకేజ్ తో నీరు నిల్వ అయి పారిశుద్ధం లోపిస్తుంది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుంచి ఎంపీడీవో భవనానికి నీటి కనెక్షన్ ఇచ్చారు. సరిగా కనెక్షన్ ఇవ్వకపోవడంతో పైపు లీకేజీ గత మూడు రోజుల నుండి నీరు వృధాగా పోతుంది. కార్యాలయ పరిసరాలలో నీటి కుంట ఏర్పడుతుంది. గతంలో మిషన్‌ భగీరథ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తాగునీటి లీకేజీ సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment