రోడ్లపై వ్యర్ధ పదార్థాలను వెయ్యరాదు : ఎస్సై తాజుద్దీన్

Written by telangana jyothi

Published on:

రోడ్లపై వ్యర్ధ పదార్థాలను వెయ్యరాదు : ఎస్సై తాజుద్దీన్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : రోడ్లపై చెత్త చెదారం వ్యర్థ పదార్థాలు. పడవేయకూడదని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఏటూరు నాగారం ఎస్సై ఎస్కే తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని రాణి రుద్రమదేవి కూరగాయ ల మార్కెట్ ఆవరణలో గురువారం కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులు చెత్త చెదారం. కుళ్లిన కూరగాయలు రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు పడి వేయడంతో ప్రధాన రహదారి పై వ్యర్థ పదార్థాలు దుర్వాసన వెదజల్లుతూ రోడ్డు మొత్తం అపరిశుభ్రంగా ఉండడంతో కూరగాయల మార్కెట్ కు వచ్చే ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతారని. రోడ్డుపై నడిచే ప్రజలు వర్షాకాలం కావడంతో రహదారి బురద మయంగా మారి జారి కింద పడిపోయే ప్రమాదం ఉందని సూచించారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు తమ షాపుల వద్ద చెత్త కుండీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామపంచాయతీ వారి వాహనం వచ్చినప్పుడు అందులో పడవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులు సుధాకర్. గోపి తది తరులు పాల్గొన్నారు

Leave a comment