వరంగల్ పార్లమెంట్ జోనల్ బిజెపి ఎస్టి మోర్చా ఇన్చార్జిగా కొత్త సురేందర్
ములుగు, తెలంగాణ జ్యోతి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మూడవసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం లోని 3 పార్లమెంట్ జోన్ వారీగా బిజెపి ఎస్టీ మోర్చా ఎలక్షన్ ఇన్చార్జిలను తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎస్టీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ప్రకటిం చారు. అందులో భాగంగా బిజెపి ఎస్టీ మోర్చా వరంగల్ జోన్ గా కొత్త సురేందర్ ని నియమించారు. బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సీట్లు మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ చేస్తున్న పనులను పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరవేసే విధంగా కార్య కర్తలు పని చేయాలని అన్నారు. నాపై నమ్మకంతో వరంగల్ జోనల్ ఇన్చార్జిగా ఎన్నిక చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్, బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు.