వరంగల్ ఎంపీ టికెట్ వెంకటేశ్వర్లుకు ఇవ్వాలి
– టిఎంపిఎస్ రాష్ట్ర కార్యదర్శి పైడి
వెంకటాపూర్ : వరంగల్ పార్లమెంట్ టికెట్లు బిజెపి పార్టీలో క్రమ శిక్షణతో పనిచేస్తున్న పెరుమాండ్ల వెంకటేశ్వర్లు కు ఇవ్వాలని తెలంగాణ మాల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీరాముల పైడి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ఒక గ్రామంలో TMPS సమావేశాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మండలంలోని నర్సాపూర్ గ్రామoలో జిల్లా ఉపాధ్యక్షుడు దండ్రే అనిల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి శ్రీరాముల పైడి మాట్లా డారు.TMPS వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు బీజేపీలో 3 సంవత్సరాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చేసి, ఎలాంటి పదవి రాకున్నా 9 సంవత్సరాల నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇంచార్జిగా పని చేస్తున్నాడని అన్నారు. బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి, క్రమ శిక్షణతో పార్టీ కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహించ డంతో పాటు పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేశాడన్నారు. 2015 లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన ఇవ్వలేదని, 2018లో అధిష్టానం ఆదేశాల మేరకు స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికి నియో జకవర్గంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటు న్నారని అన్నారు. 2023లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవ కాశం ఇవ్వకున్నా నియోజకవర్గం ఇంచార్జిగా పని చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఆస్తులు కోల్పోయినా పార్టీ కోసం శ్రమిస్తు న్నారని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన అన్ని ప్రజా సంగ్రామ యాత్రల్లో కార్యకర్తలను సమీకరించి పాదయాత్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే వెంకటేశ్వర్లుకు ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించు కుంటామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, రమేష్ జిల్లా నాయకులు పవన్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.