యువత మేలుకో డ్రగ్స్ వదులుకో

Written by telangana jyothi

Published on:

యువత మేలుకో డ్రగ్స్ వదులుకో

– వాజేడు ఎస్సై రుద్ర హరీష్

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండల కేంద్రంలో మాదక ద్రవ్యాలు నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా వాజేడు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా వాజేడు లో మాదక ద్రవ్యాల నిర్ములన ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా యువత మేలుకో డ్రగ్స్ వదులుకో, భవితను మలుచుకో, డ్రగ్స్ మిమ్మల్ని పాతి పెట్టకముందే మీరే వాటిని పాతి పెట్టండి” అనే శీర్షిక తో ప్రోగ్రాం నిర్వహించారు. మాధక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, వాజేడు ఎస్.ఐ. రుద్ర హరీష్ పిలుపు నిచ్చారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్దాల గురించి ఏదైనా సమాచారం ఉంటే, వెంటనే ఈ సెల్ నెంబర్ కు 8712670120 సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గొప్యంగా ఉంచబడు తుందని ఎస్.ఐ . తెలిపారు. డ్రగ్స్ సమాచారం మాకు – నగదు బహుమతి మీకు, అనే కాన్సెప్ట్ మీద ప్రోగ్రాం నిర్వహించారు . ప్రోగ్రాం లో వాజేడు ఎస్ఐ ఆర్. హరీష్, సివిల్ ,మరియు సిఆర్పీఫ్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

Leave a comment