కోడి పందేల స్థావరాలపై వాజేడు పోలీసుల దాడులు
వాజేడు,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండ లంలోని వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతూరు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, గెర్రగూడెం గ్రామాల శివారులో కోడి పందాల స్థావరాలు పై పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో పై అధికారుల ఆదేశాల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా గేర్రగూడెం ఊర చెరువు దగ్గర కొంతమంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అలుగోకి తీసుకున్నట్లు ఎస్సై హరీష్ తెలిపారు. 14 మందిని అదుపు లోకి తీసుకొని వారి దగ్గర ఉన్న కోడి పుంజులను, కత్తులను స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తుల వద్ద నుండి 5 కోళ్ళు, 4 కత్తులు, రూ. 28900 స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు.