వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం
వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం
– రాష్ట్ర అధ్యక్షులుగా వెంకటాపురం వాసి డర్రా దామోదర్ ఎంపిక.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు చింతూరు వెంకటరావు ఆదేశాల మేరకు చింతూరు సంఘం నేత చింతూరు గాంధీ అధ్యక్షతన సోమవారం భద్రాచలం ఎన్జీవో భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడ బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. మన మంతా ఒక తాటిపై నిలిచి ఐక్యంగా ఉండి వెనుకబడిన తరగతుల సామాజిక వర్గ రిజర్వేషన్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ ఉపాధి రంగాలలో ప్రభుత్వం నుండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మన సామాజిక వర్గం అభివృద్ధికి, ప్రభుత్వాలు కృషి చేయాలని, కులం సర్టిఫికెట్లు,మత్స్య సొసైటీలో ప్రాతినిధ్యం,ఉండాలని తీర్మానించారు. భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకుని, వాడబలిజల అభివృద్ధికి కార్యాచరణ పై చర్చించుకోనీ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులుగా వెంకటాపురం చొక్కాల వాసీ డర్రా దామోదర్ ఏకగ్రీవంగా హర్షద్వానాల మధ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గార ఆనంద్, గగ్గూరి రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా బోడింకి చందు, కోశాధికారిగా బోట రమణయ్య, అధికార ప్రతి నిధులుగా చింతూరి వెంకటరావు, తోట మల్లికార్జున్ రావు, తోట నాగేశ్వరరావు, చింతూరి గాంధీ,బోడంకి మహేష్, అల్లి నాగేశ్వరరావు,బద్ది శీను,కొప్పుల మురళి,తోట ప్రశాంత్, బొల్ల నరేష్,సంకపాప గణపతి,జిల్లెడ వెంకటేష్,గార మహేష్. తదితరులు ఎన్నికయ్యారు.