వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

Written by telangana jyothi

Published on:

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

– గ్రామ, గ్రామాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

– వెల్లివిరిసిన దేశభక్తి, జాతీయ జెండాలతో ర్యాలీలు

వెంకటాపుర్ : వెంకటాపుర్ మండలంలోస్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా, గ్రామ గ్రామాన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,రాజకీయ పార్టీ లు, సంఘాలు, ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేసి బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ దేశభక్తి గీతాలతో జేజేలు పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రధాన రహదారులపై దేశభక్తి నినాదాలతో భారీ ర్యాలీ లు నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు కుల సంఘాలు ఆటో వర్కర్స్ యూనియన్, ఆర్యవైశ్య సంఘం, ఇంకా అనేక సంఘాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయాలు లో జాతీయ జెండాలు ఎగరవేశారు. లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో మూడు రాజు, సొసైటీ కార్యాలయంలో ఎర్రబెల్లి గోపాలరావు, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరగాని రాజయ్య లు జాతీయ జెండాలను ఎగురవేశారు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జాతీయ జెండాల ఎగరవేసి మిఠాయిలను పంపిణీ చేశారు.

Leave a comment