వాజేడులో వాలీబాల్ పోటీలు

Written by telangana jyothi

Published on:

వాజేడులో వాలీబాల్ పోటీలు

– మొదటి స్థానం సాధించిన కొంగాల జట్టు 

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : యాంటీ డ్రగ్స్ క్యాంపియన్ లో భాగంగా ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామీణ యువతకు వాలీబాల్ పోటీలు నిర్వ హించారు. ఈ పోటీలలో కొంగాల జట్టు మొదటి స్థానం సాధిం చింది. అలాగే మురుమూరు జట్టు రెండో స్థానం ,వాజేడు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు గురువారం ఉదయం నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ గెలుపొందిన వాలీబాల్ జట్లకు అభినందనలు తెలుపారు. టోర్నీని విజయవంతం చేసినందుకు క్రీడాకారు లను అభినందించారు. గ్రామీణ యువత మాదక ద్రవ్యాలు ,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామీణ క్రీడలు స్నేహ సంబంధాలను, దేహదారుఢ్యం తో పాటు, వారి క్రీడా ప్రతిభను పోటీలు ధ్వరా వెలుగులోకి తీసుకువచ్చి, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుం దని కోరారు. యువత విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని, బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని, సి.ఐ.కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్,పి .ఈ. టి .సతీష్ పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment