వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణం నిర్వహించాలి. 

Written by telangana jyothi

Published on:

వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణం నిర్వహించాలి. 

అందుకు అన్ని శాఖల అదికారులు కృషి చేయాలి. 

– వెంకటాపురం తాసిల్దార్ లక్ష్మీరాజయ్య 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : శ్రీవినాయ క చవితి నవరాత్రి ఉత్సవాలు, 16న జరిగే  నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించడాని కి అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దామని వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య కోరారు. శుక్రవారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో పోలీస్, విద్యుత్తు, మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఇతర శాఖల అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. జిల్లా ఉన్నతాధి కారుల ఆదేశాలతో సమావేశం నిర్వహించారు. మండలంలోని 18 పంచాయతీలలో శ్రీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయనీ, ఆయా నవరాత్రి మహోత్సవాల కమిటీలు పోలీస్,విద్యుత్ శాఖలనుండి నిభందనల ప్రకారం అనుమ తులు పొందాలని సూచించారు. నవరాత్రులు ముగింపు తర్వాత 16వ తేదీన సమీప వాగులు, చెరువులలో శ్రీ వినాయక స్వామి వారి విగ్రహాలను నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఆయా నిమజ్జానాల ఊరేగింపులు, నిమజ్జన సమయాల్లో గోదావరి, వాగులు, చెరువులు ప్రవాహాల్లో, విగ్ర హాలను నిమజ్జనం చేసే సమయాల్లో నీటీ ప్రమాదాలు జరగకుండా కృషి చేయాలని కోరారు. అలాగే స్వామివారి విగ్రహాల ఊరేగింపు సమయంలో కూడా ఉత్సవ కమిటీలకు తగు సూచనలు,భద్రతా పరమ్మన సలహాలతో, శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా కృషి చేద్దామని తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య తెలిపారు. ఈ సమావేశంలో వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారు కుమార్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment