గ్రామాల్లో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం

గ్రామాల్లో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం

– ఉపాధి హామీ కూలీల దగ్గర కాంగ్రెస్ నాయకుల ముమ్మర ప్రచారం.

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామములో మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబు శ్రీను బాబు ఆదేశాల మేరకు శుక్రవారం అన్నారం గ్రామములో ఉపాధి హామీ కూలీల దగ్గర ప్రచారం నిర్వహించారు.అలాగే నాగ పల్లిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లా డుతూ పార్లమెంటు ఎన్నికలో మన అభ్యర్థి వంశిక్రిష్ణను గెలిపించి రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రతీ మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమములో బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు కోట రాజబాపు, ఎంపీపీ రాణి బాయి, యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు కటకం అశోక్, ఎంపీటీసీ లు మంచినీళ్ల దుర్గయ్య, రెవెల్లి మమత నాగరాజు,అన్నారం మాజీ సర్పంచ్ రమాదేవి శేఖర్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బందెల సత్యమ్మ, మండల కాంగ్రేస్ ఉపాధ్య క్షులు కోట సమ్మయ్య,మైనార్టీ బ్లాక్ అధ్యక్షులు ఆశ్రర్ ఖురేషి, బ్లాక్ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్, మండల అధికార ప్రతినిధి బుర్రి శివరాజు, కాంగ్రేస్ సీనియర్ నాయకు లు వెన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డ్ నెంబర్ మెషినేని రవిచందర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు బీరం బాపు రెడ్డి, కాంగ్రేస్ యూత్ జిల్లా సెక్రటరీ పర్శవేణి నాగేష్ యాదవ్, మైనార్టీ జిల్లా సెక్రటరీ గాయస్ ఖాన్, మాజీ ఉపసర్పంచ్ మోతే సాంబయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.