నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ కు సన్మానం

నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ కు సన్మానం

నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ కు సన్మానం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల తాసిల్దారుగా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ ను బుధవారం వాడ బలిజసేవాసంఘం ఆధ్వర్యంలో కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంకటాపురం మండలంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటు వంటి వాడ బలిజ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వాడ బలిజలకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు డర్రా దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్ రావు, ములుగు జిల్లా ముఖ్య సలహాదారు బద్ది ఆదినారాయణ, మండల అధ్యక్షులు బొల్లె సునీల్, వాజేడు మండల అధికార ప్రతినిధి బొల్లె ఆదినారాయణ, కార్యదర్శి బోగట విజయబాబు, మల్లికార్జున్, పోతురాజు, వెంకటేష్, సారయ్య, చిట్టిబాబు, కన్నయ్య, నాగేంద్రబాబు, శ్రీను, జోగారావు, రమేష్, యశ్వంత్, వినయ్, నరసయ్య, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment