భూపాలపల్లి సీసీఎస్ ఇన్ స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) ఇన్స్పెక్టర్ గా ఎన్ వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2009 ఎస్ ఐ బ్యాచ్ కు చెందిన వెంకటేశ్వర్లు మంథని సీఐ గా పని చేస్తూ, భూపాలపల్లి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు. సీసీఎస్ లో బాధ్యతలు చేపట్టిన తరువాత ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరే ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నిర్వహించాల్సిన విధులపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.